రేపు షర్మిల కొత్త పార్టీ ఆవిర్భావం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యం తేవాలనే దిశగా అడుగులు వేస్తోంది వైఎష్ షర్మిల. ఇక ఎన్నో రోజుల నుంచి పార్టీ పెడతానంటూ తెలంగాణ ప్రజలకు దగ్గరవుతోంది ఈ జగనన్న చెల్లెలు. దీంతో ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసుకుని రేపు హైదరాబాద్‌లో పార్టీ అవిర్బావాన్ని ప్రారంభిస్తోంది. ఇక ఇప్పటికే షర్మిల ఇడుపులపాయకు చేరుకుంది. రేపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావటంతో ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ప్రార్థనలు చేయనున్నారు.

అనంతరం ఆమె పార్టీ జెండాను కూడా ఆయన సమధి వద్ద ఉంచి అశీర్వాదం తీసుకోనుంది షర్మిల. అనంతరం ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానుంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పార్టీ ప్రకటనను ప్రారంభించనున్నారు. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అంటూ కొన్ని రోజుల నుంచి మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: