దానంకు షాక్..ఆరు నెలల జైలు శిక్ష

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ అధికార పార్టీ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్ తగిలింది. ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును వెలువరించింది. 2013 లో జరిగిన అల్లర్ల కేసులో భాగంగా న్యాయస్థానం ఆయనకు శిక్షవిధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రూ.1000 జరిమానా కూడా విధించింది కోర్టు. ఇక 2013లో జరిగిన ఓ అల్లర్ల కేసులో భాగంగా బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇన్ని రోజుల తర్వాత ఆ కేసును నేడు విచారించిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షవిధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: