అద్దంకి వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

అద్దంకి వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతూ పార్టీలో గ్రూపు రాజకీయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు పంక పార్టీ నేతలు. తాజాగా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు కాలుదువ్వుతున్నారట. ఇక రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా వేడుకులను జరిపేందుకు ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతల గొడవ పడ్డారని తెలుస్తోంది.

దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా జయంతి వేడుకలను జరపాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు ఆయన వ్యతిరేక వర్గం నేతలు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాచిన కృష్ణ చైతన్య వర్గం నేతలు దానిని అడ్డుకున్నారు. దీంతో ఇది చినిగి చినిగి పోలీసుల వరకు వెళ్లింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వేడుకలు చేయాలన్న మా అనుమతి తప్పనిసరి అంటూ తెలిపారు పోలీసులు.

Share.

Comments are closed.

%d bloggers like this: