సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రతీ రోజు ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని సీఎంకు లేఖలు రాస్తూ రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తున్నారు. తాజాగా ఆయన రాసిన లేఖలో ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద పోలీసులు కేసుల నమోదును ఆపాలని ఆయ‌న లేఖ ద్వారా కోరారు. నిత్యం ఏదో వార్తతో ప్రజల ముందుకు కొత్త కొత్త సమాచారాన్ని అందిస్తుంటాయి సామాజిక మాద్యమాలు. ఇటువంటి మాద్యమాలపై అనవసరంగా కేసులు పెట్టి వారిని ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేసినా..మళ్లీ కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో తెలిపారు రఘురామ.

Share.

Comments are closed.

%d bloggers like this: