రేపు వైఎస్సార్ జయంతి

Google+ Pinterest LinkedIn Tumblr +

రేపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. దీంతో వేడుకులను జరిపేందుక తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు అంతా సిద్దం చేస్తున్నారు. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. డాక్టర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించిన ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగి తన సేవలను ప్రజా జీవితానికి అంకితం చేశారు.

ఆరోగ్య శ్రీ, 108 వంటి సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా మారారు. ఇక రేపు ఆయన జయంతి కావటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేడుకులకు అంతా సిద్దం చేస్తున్నారు. దీంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఇప్పటకే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇక రేపు జరగబోయే జయంతి వేడుకల్లో భాగంగా ఆయన సమాధి వద్ద విజయమ్మ, షర్మిల, జగన్‌ పలువురు ఆయనకు నివాళులు అర్పించనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: