Bharateeyudu 2 Movie Updates

Google+ Pinterest LinkedIn Tumblr +

కొన్ని సినిమాలు ఎంతకాలమైనా అలా గుర్తుండి పోతాయి. అలా చెప్పుకునే సినిమాల్లో భారతీయుడు సినిమా ఒకటి.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…
శంకర్ .. కమలహాసన్ కాంబినేషన్లో ‘భారతీయుడు 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ నటించనుంది. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

తొలి షెడ్యూల్ ను ‘చెన్నై’లో ప్లాన్ చేశారు. ఆ తరువాత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ‘పొల్లాచ్చి’లో చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్ ను ‘ఉక్రెయిన్’లో జరపనున్నారు. ఇది మేజర్ షెడ్యూల్ .. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో మరింత ఫిట్ నెస్ తో కనిపించడానికి కమల్ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారట. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Share.

Leave A Reply

%d bloggers like this: