తొలి జాబితాలో 123 మంది పేర్లను జనవరి 9న !

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు వస్తుండడంతో జోరు పెంచిన వైసీపీ ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న జగన్. వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీం రిపోర్ట్‌లతో సీట్లు కేటాయింపు తొలి జాబితాలో 123 మంది పేర్లను ప్రకటించే అకాశం జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్న పాదయాత్ర

తొలి లిస్ట్‌లో ప్ర‌కాశం జిల్లా నుంచి మానుగుంట మహిధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బెర్ర మధుసూదన్, ఆదిమూలపు సురేష్‌లకు టిక్కెట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మానుగుంట మ‌హిధ‌ర్ రెడ్డికి కందుకూరు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు, బెర్ర‌ మ‌ధుసూద‌న్‌కి క‌నిగిరి, ఆదిమూల‌పు సురేష్‌కి ఎర్ర‌గొండ‌పాలెంలలో సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం టిక్కెట్‌ను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి ఖరారు చేశారు. వీరితోపాటు గిద్ద‌లూరు నుంచి అన్నా రాంబాబుకు కూడా టిక్కెట్ ఫిక్స్.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో యుద్ధ వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని, భావిస్తున్న వైసీపీ జోరు పెంచింది. ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తూ ఉన్న జగన్.. వ‌చ్చేనెల‌ 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించనున్నారు. ఈ సంధర్భంగా జగన్ చేయనున్న ప్రకటనపై చర్చ జరుగుతుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మ‌రానికి కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో జగన్ అప్రమత్తమయ్యారు. అభ్యర్థుల గెలుపోటములు, అనుకూలతలు, ప్రతికూలతలపై సర్వేలు మీద సర్వేలు చేయించారు. ఇటీవలే వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీం నుంచి సర్వే రిపోర్ట్‌లు అందాయి. రిపోర్ట్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జగన్ ఆయా నియోజకవర్గాల సమన్వయ కర్తలకు దిశానిర్దేశం చేశారు. కొందరికి తీరుమార్చుకోకపోతే మార్చేస్తా అంటూ వార్నింగ్ లు సైతం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చేయించిన స‌ర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఇప్ప‌టికే కొంత‌మంతి అభ్య‌ర్ధులను వైసీపీ అధినేత జగన్ ఫైన‌ల్ చేశార‌ట. సంక్రాంతి త‌ర్వాత అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్టు అధికార పార్టీ ప్ర‌క‌టించ‌గా, అంత‌కుముందే సంక్రాంతి లోగా అభ్య‌ర్థులను ప్ర‌క‌టించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ స్థానాల‌తో పాటు మెజార్టీ ఎంపీ సీట్ల‌కు కూడా అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తొలి జాబితాలో 123 మంది పేర్లను ప్రకటించే అకాశాలున్నాయ‌ని స‌మాచారం. జగన్ లక్కీ నంబర్ ఆరు కావటంతో న్యూమరాలజీ ప్రకారం 123 మందిని ఖాయం చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఆరుగురు ఎంపీలను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే అంచ‌నాలున్నాయి. ఈ నేపథ్యంలో వ‌చ్చేనెల‌ 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడే అభ్యర్ధుల తొలి జాబితాను ఆయన వెల్లడించనున్నారని సమాచారం. ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందుగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసి కేసీఆర్ తెలంగాణాలో స‌క్సెస్ అయ్యారు. దాంతో ముంద‌స్తు అభ్య‌ర్థుల ఖ‌రారు ప్ర‌క్రియ‌ కలిసొస్తుందని ఏపీలోని పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగా జ‌గ‌న్ ముందుగా లిస్టు ప్ర‌క‌టించ‌బోతున్నట్లు తెలుస్తుంది.

ఇక తొలి లిస్ట్‌లో ప్ర‌కాశం జిల్లా నుంచి మానుగుంట మహిధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బెర్ర మధుసూదన్, ఆదిమూలపు సురేష్ లకు టిక్కెట్లు కన్ఫమ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మానుగుంట మ‌హిధ‌ర్ రెడ్డికి కందుకూరు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు, బెర్ర‌ మ‌ధుసూద‌న్‌కి క‌నిగిరి, ఆదిమూల‌పు సురేష్‌కి ఎర్ర‌గొండ‌పాలెంలలో సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నలుగురు అభ్యర్థులకు 2019 ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫమ్ అని అందులో ఎలాంటి మార్పులు ఉండవని జగన్ తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి ఖరారు చేశారు. వీరితోపాటు గిద్ద‌లూరు నుంచి అన్నా రాంబాబుకు కూడా దాదాపుగా టిక్కెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. jagan1.jpg

Share.

Leave A Reply

%d bloggers like this: