దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేకత చాటుకున్న ప్రకాష్ రాజ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్న విలక్షణ నటుడు కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తూ వార్తలకెక్కిన ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజకీయరంగ ప్రవేశం అంటూ ప్రకటన తెలంగాణా నుండి తెరాస తరుపున పోటీ చేస్తారా?
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు ప్రకాష్ రాజ్.. గతకొంతకాలంగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ముందుకు సాగుతున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ప్రధాని మోదీ విధానాలను వ్యతిరేఖిస్తూ ముందుకు సాగుతున్న ప్రకాష్ రాజ్.. వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాడా? అందులోనూ తెలుగురాష్ట్రాల నుండి ఎన్నికల సమరంలోకి అడగు పెడుతున్నాడా?
సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. అయితే వాళ్ల అవసరాల కోసమో ఆస్తులను కాపాడుకోవడానికో ఓ రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయం మెజార్టీ ప్రజలలో ఉంది. అయితే ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. నూతన సంవత్సరం వేళ అభిమానులందరికీ శుభాకాంక్షలు చెప్పిన ప్రకాష్ రాజ్.. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ ఈ ప్రకటనకు ముందే పలు పార్టీల నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
దాదాపు రెండు వందల సినిమాలకు పైగా సినిమాలలో నటించిన ప్రకాష్ రాజ్.. కర్ణాటకకు చెందిన వ్యక్తి అయితే ఆయనకు తెలుగు రాష్ట్రాలతో అవినాభావ సంబంధం ఉంది. ఆయనకు హైదరాబాద్‌లో వ్యవసాయ క్షేత్రాలు ఫామ్ హౌస్ కూడా ఉంది. తెలంగాణాలో ఓ గ్రామాన్ని కూడా ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారు. ఇటీవల తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా ప్రకాష్ రాజ్ తెలంగాణా రాష్ట్ర సమితికి సపోర్ట్ చేస్తూ పలు ప్రకటనలు చేశారు. దీంతో ఆయన తెలంగాణా .రాష్ట్రంలో పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఆయన ఇప్పడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే కన్నడ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ప్రకాష్ రాజ్ స్వతంత్రంగా పోటీ చేస్తారని, ఎలా అయినా ఎంపీ అయిన పార్లమెంట్లో “జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రశ్నించాలనుకుంటే… దానికి టీఆర్ఎస్కు మించిన ఆప్షన్ ఉండదని అంటున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనల కోసం.. కర్ణాటక వెళ్లినప్పుడు, తమిళనాడు వెళ్లినప్పుడు ప్రకాష్ రాజ్ సాయం చేశారు. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ ప్రగతి భవన్ ఆతిధ్యం కూడా తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్‌కు గొప్పగా సపోర్ట్ చేస్తూ టీవీ ఇంటర్యూలు ఇచ్చారు కాబట్టి… ఎంపీ సీటు ఇవ్వడానికి కేసీఆర్ వెనుకడుగు వేయకపోవచ్చు. కాకపోతే.. ప్రకాష్ రాజ్‌కు కేసిఆర్‌కు మథ్య ఉన్న ఒకే ఒక్క అడ్డంకి ఆయన విధానాలు. ప్రకాష్ రాజ్‌ను ఎంపీని చేస్తే ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. టీఆర్ఎస్ విధానం దానికి వ్యతిరేకం. ఈ విధానపరమైన అభిప్రాయబేధం తప్ప… టీఆర్ఎస్లో ప్రకాష్‌రాజ్ చేరికకు ఎటువంటి ఇబ్బంది లేదు.
ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి రానప్పటికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. స్నేహితురాలు, కన్నడ రచయిత్రి గౌరి లంకేష్ హత్య తర్వతా ప్రకాష్ రాజ్.. రాజకీయంగా ఎగ్రెసివ్‌గా మాట్లాడటం ప్రారంభించారు. నోట్లరద్దు.. జీఎస్టీ వంటి వాటిని వ్యతిరేఖిస్తూ తనదైన శైలిలో ప్రధాని నిర్ణయాలను ప్రకాష్ రాజ్ వ్యతిరేఖించారు. ఆయన తన వ్యాఖ్యల వల్ల ఎన్నో బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. చూడాలి మరి రాజకీయంగా ప్రకాష్ రాజ్ ఏ మార్గం ఎంచుకుంటాడో..?