తెలుగుదేశం నుండి జనసేనలోకి ఎమ్మెల్యే రావెల

Google+ Pinterest LinkedIn Tumblr +

MLA from Ravela to Janasena from TDPపత్తిపాడు నియోజకవర్గంలో రసవత్తర రాజకీయాలు నియోజకవర్గ నాయకులకు అండగా ఉన్న గల్లా అరుణకుమారి తెలుగుదేశం నుండి పార్టీకి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యే రావెల రావెలకు తోడుగా బయటకు వెళ్లని నేతలు

ప్రత్తిపాడు నుంచి 2014లో శాసనభ్యుడుగా ఎన్నికైన రావెల కిషోర్‌ బాబు వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీకి అవకాశం ఉన్న నియోజకవర్గం ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటకు వచ్చీ రాగానే ఎమ్మెల్యే సీటు అందివచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్న రావెల ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి రంగంలోకి దిగారు. నియోజవర్గ నేతలతో మమేకమైన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి పోటీ చేయాలని చూస్తున్న కందుకూరి వీరయ్య, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కూచిపూడి విజయమ్మ, చెవుల కృష్ణాంజనేయులు, జాన్‌లు

గుంటూరు జిల్లా పత్తిపాడు రాష్ట్రంలో విలక్షణమైన నియోజకవర్గంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలలో అన్నీ చోట్ల ప్రతిపక్షం నుండి ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి జంప్ అవుతుంటే ఈ నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు మాత్రం జనసేన పార్టీలో చేరారు. దీంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓ ఎంపీ తల్లి స్థానికంగా నియోజకవర్గంలో నాయకులకు అండగా నిలబడుతున్నారు. ఆమె ఎవరు? నియోజకవర్గం పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ప్రతిపక్ష పార్టీల నుండి పార్టీలు మారి అధికార పార్టీలోకి రావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఆంధ్రలో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అధికార పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచి 2014లో రావెల కిషోర్‌ బాబు శాసనభ్యుడుగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రావెల కిషోర్ బాబు పార్టీ మారినా కూడా స్థానిక నాయకులు మాత్రం ఈ నియోజకవర్గంలో ఆయన వెంట వెళ్లలేదు.
MLA from Ravela to Janasena from TDP

నియోజకవర్గంలో రావెలపై అసమ్మతి ఎక్కువగా ఉండడంతో ముందే చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇవ్వనని స్పష్టం చేయడంతో చాలా కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరేందుకు విశ్వప్రయాత్నాలు చేసినా కూడా అక్కడ అవకాశం దొరక్కపోవడంతో ఆయన చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వాస్తవానికి చాలా మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలో చేరుతున్నా తెలుగుదేశం నుండి ఎమ్మెల్యే మాత్రం పార్టీకి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

వాస్తవానికి రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్నవారికి కూడా దక్కనంత స్థాయి రావెల కిశోర్ బాబుకు చంద్రబాబు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటకు వచ్చీ రాక ముందే ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఏకంగా కీలక శాఖలతో కూడిన కేబినెట్‌ పదవి కూడా రావెలకు చంద్రబాబు కట్టబెట్టారు. అయితే అందివచ్చిన అదృష్టాన్ని కూడా అంతే స్పీడుగా ఆయన చేజార్చుకున్నారు. ఊహించని స్థాయిని కల్పించిన అధినేత చంద్రబాబు వద్ద పట్టు సాధించలేకపోవటం, అడగకుండానే ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు దగ్గర కాలేకపోవటం మూలంగా మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా రావెల పేరు ఎత్తడంలేదు.

ఇదిలా ఉంటే నియోజకవర్గంలో కొంతమేరకు నష్టం అని భావిస్తున్న నాయకులతో చర్చలకు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పార్టీ బలం చెదరకుండా ఉండటం కోసం పార్టీ శ్రేణులకు మరింత అండగా నిలవాలని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించటంతో ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా దృష్టి సారించారు. ఇప్పటికే జయదేవ్‌ తల్లి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి ఆ నియోజవర్గ నేతలతో మమేకమై పలు విడతలుగా సమావేశమై ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీ కేడర్‌కు ధైర్యం చెప్తుంది. కాగా టీడీపీ నుండి గతంలో ఓటమిపాలైన కందుకూరి వీరయ్య, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కూచిపూడి విజయమ్మ, చెవుల కృష్ణాంజనేయులు, జాన్‌లు తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: