Advertisements

Azharuddin may be Party is changing.!

Google+ Pinterest LinkedIn Tumblr +

గులాబీ గూటికి చేరేందుకు సిద్ద‌మైన మాజీ క్రికెట్ కెప్టెన్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై స్ప‌ష్ట‌మైన హామీ లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్న పార్టీ నేతలు టీఆర్ఎస్‌ను దుమ్మెత్తిపోసిన నేతల్లో ఉన్న అజారుద్దీన్ సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం.

చోటామోటా నేతల దగ్గరి నుంచి పెద్ద నాయకుల వరకు అందరి చూపూ తెలంగాణ భవన్ వైపే రాజ‌కీయ భ‌విష్య‌త్ పై స్ప‌ష్ట‌మైన హామీ లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న అజారుద్దీన్ ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో చర్చలు సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ఞప్తి 2009లో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గెలుపొందిన అజారుద్దీన్ 2014లో పోటీకి దూరం.. తర్వాత పూర్తిగా తెలంగాణకే పరిమితం ఇటీవల పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన కాంగ్రెస్ నోట్లరద్దు, జీఎస్టీ అంశాలలో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిచ్చిందంటూ విమర్శలు టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నాటకాలు ఆడిందంటూ విమర్శలు.

తెలంగాణాలో తెరాస సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెరాస ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టేందుకు సిద్దం అవుతుందా? పైకి మాత్రం పార్టీ మారము అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నా కూడా అవకాశం దొరికితే మాత్రం గులాబీ గూటికి చేరేందుకు నేతలు సిద్దంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలో మాజీ ఎంపి ప్ర‌స్తుత తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మాజీ క్రికెట్ కెప్టెన్ సైతం కారెక్కేందుకు సిద్ద‌మ‌య్యారట. ఇంతకీ ఆయనెవరు..? ఎప్పుడు చేరుతారు..?

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కూడా కాంగ్రెస్ లో క‌ల‌వ‌రం కొన‌సాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేత‌లుగా ఉన్న వారు సైతం పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నారు. చోటామోటా నేతల దగ్గరి నుంచి పెద్ద నాయకుల వరకు తెలంగాణ భవన్ వైపు నేతలు చూస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎంపి ప్ర‌స్తుత తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సైతం కారెక్కేందుకు సిద్ద‌మైనట్లు తెలుస్తుంది. కొంత కాలంగా ఆయ‌న కాంగ్రెస్‌ను వీడుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ఆయ‌న పోటీ చేసే సీటు..రాజ‌కీయ భ‌విష్య‌త్ పై స్ప‌ష్ట‌మైన హామీ లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అయితే ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్‌ అధికారికంగా చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన అజారుద్దీన్ రాజ‌కీయ ప్ర‌వేశం నుండి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2009 లో కాంగ్రెస్‌లో చేరిన ఆయ‌న అదే సంవ‌త్స‌రంలో జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితం అయ్యారు.

తాజాగా తెలంగాణాలో జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయనను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడటంతో అజారుద్దీన్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి టిఆర్‌య‌స్‌కు సైతం బ‌ల‌మైన అభ్యర్ధి అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయం ఉంది. దీంతో అజారుద్దీన్‌కు అవ‌కాశం ఇవ్వ‌టం ద్వారా టిఆర్‌య‌స్‌కు సైతం మేలు జ‌రుగుతుంద‌నే భావ‌న పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను దుమ్మెత్తిపోసిన నేతల్లో అజారుద్దీన్ కూడా ఉన్నారు. టీఆర్ఎస్‌కి ఓటేస్తే, బీజేపీకి వేసినట్లే అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అంశంతోపాటూ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిచ్చిందని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నాటకాలాడి… మైనార్టీలను మోసం చేసిందని అజారుద్దీన్ ఆరోపించారు. అయితే రాజకీయాల్లో శాశ్విత మిత్రలు కానీ శత్రువులు కానీ ఉండరు అనేది వాస్తవం. అందవల్లే అజారుద్దీన్ చేరికకు అభ్యంతరాలు లేవు అని నాయకులు చెప్తున్న మాట. అయితే సంక్రాంతి తర్వాత ఈ పరిణామం జరగొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: