ఎన్టీఆర్ రికార్డులను కెసిఆర్ తిరగరాస్తున్నాడా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాజకీయాలలో రికార్డులు క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు? అంటే టక్కున చెప్పే పేరు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్దమైనట్లు తెలుస్తుంది. అన్నిట్లో తానే నెంబర్.1 అనిపించుకుంటూ ఇప్పటికే ఒక రికార్డు బ్రేక్ చేసిన కేసిఆర్ మరో రికార్డు బ్రేక్ చేసేందుకు సిద్దమయ్యారట. ఇంతకీ కేసీఆర్ బ్రేక్ చేయబోయే రికార్డు ఏంటి..? ఏన్టీఆర్ సృష్టించిన రికార్డు ఏంటీ..? ఆ రికార్డును కేసీఆర్ ఏలా బ్రేక్ చేయబోతున్నారు..

తెలుగు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.. ఆయన తర్వాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్.. అటువంటి రికార్డులను తన సొంతం చేసుకుంటున్నారు. అన్నిట్లో తానే నెంబర్.1 అనిపించుకుంటుంన్నారు. కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయం సొంత పార్టీ నేతలు కూడా ఊహించలేరు. అది ఏమ్మేల్యే అభ్యర్దుల ఏంపిక అయినా.. ముందస్తు ఏన్నికలకు పోవడం అయినా.. ఫెడరల్ ఫ్రంట్ కూర్పు అయినా.. ఇలా కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం ఇప్పటి వరకు సంచలనమే.. ముందస్తు ఏన్నికలకు వెళ్ళిన వారు ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు.. అయినా ఓకడుగు ముందస్తుకే వేశారు కేసిఆర్.

ఎన్నికల రణరంగంలో కూటమి గెలుపు కాయమని అందరూ విశ్లేషించారు…కానీ వారి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ …తెలంగాణ లో తిరుగులేని విజయం సాధించారు కేసీఆర్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పార్టీలు ముందస్తు ఏన్నికలకు వెళ్ళి గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఆ రికార్డులరు బ్రేక్ చేసారు కేసీఆర్. గతంలో ఏన్టీఆర్, చంద్రబాబు ముందస్తు ఏన్నికలకు పోయి ఓటమి చవిచూసారు. అందుకే ముందస్తు ఏన్నికలు వెళ్ళినవారు అధికారంలోకి రారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇవేవీ కేసీఆర్ విజయాన్ని ఆపలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రికార్డును ముందస్తు ఏన్నికలకు వెళ్ళి కేసీఆర్ బ్రేక్ చేసారు….

ఇక మరో రికార్డు బ్రేక్ చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు కేసీఆర్.. క్యాబినెట్ విస్తరణ చేయకుండా 31 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏన్టీఆర్… క్యాబినెట్ విస్తరణ చేయకుండా ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఏక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడిపిన సీఏంగా రికార్డుకెక్కారు. ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్దమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్.. అనేక కారణాల వల్ల తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుంది. గతంలో 63 ఏమ్మేల్యేలు గెలిచినపుడే పార్టీలో మంత్రి పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ ఏన్నికల్లో 89మంది ఏమ్మేల్యేలు గెలవడంతో గతంతో పోలిస్తే మంత్రి పదవుల ఆశించే వారి సంఖ్య భాగా పెరిగింది. దీంతో ఏవరికి మంత్రి పదవులు ఇవ్వాలో తెలియని పరిస్థితి. దీంతో మంత్రి పదవులు ఏవరికి ఇవ్వాలనేదానిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో తెలంగాణ లో పంచాయతీ ఏన్నికలు ఉన్నందున జనవరి 30 వరకు క్యాబినెట్ విస్తరణ చేయరని అంటున్నారు. దీంతో ఫిబ్రవరిలో క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని అది కూడా కొద్ది మందిని మాత్రమే క్యాబినెట్ లోకి కేసీఆర్ తీసుకుంటారని సమాచారం. ఫిబ్రవరిలో 7 లేదా 8మంది ఏమ్మేల్యేల ను మంత్రులు గా తీసుకుంటారని …పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ జరగాలంటె పార్లమెంట్ ఏన్నికలు అయిపోయిన తరువాత అనే ప్రచారమూ జరుగుతుంది… అంటె ఈ రకంగా కూడా ఏన్టీఆర్ రికార్డును బ్రేక్ చేస్తున్నారు కేసీఆర్. క్యాబినెట్ లేకుండా 31 రోజులు ప్రభుత్వాన్ని నడిపిన ఏన్టీఆర్ రికార్డును కేసీఆర్ మరికొద్ది రోజుల్లో బ్రేక్ చేయనున్నారు. వన్ మ్యాన్ ఆర్మీలా తెలంగాణాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేసిఆర్ ఈ రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: