రాత మార్చే రెస్యూమ్!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉద్యోగానికి ఎంపిక కావడంలో రెస్యూమ్ కీలక పాత్ర పోషిస్తుంది. మన పని తీరు, అనుభవాలకు అది ప్రతీక. రెజ్యూమ్‌ షార్ట్‌ గా, క్రిస్పిగా, అన్ని వివరాలతో ఉండాలి. అనుభవం, ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌, సాధించిన ఘనతల గురించి మొదటి పేజీలోనే వివరించాలి. రెజ్యూమ్‌ను కస్టమైజ్‌ చేయాలి. మనం దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సరిపడా స్కిల్స్‌ను మాత్రమే పొందుపర్చాలి.
ఆ ఉద్యోగానికి ఉపయోగపడని అనుభవాలను, స్కిల్స్‌ మెన్షన్‌ చేయనక్కర్లేదు. అప్పుడు రెజ్యూమ్‌ చిన్నగా ఉంటుంది. రిక్రూటర్‌ తక్కువ సమయంలో చదివేందుకు వీలుపడుతుంది. మన గురించి కొద్ది సమయంలోనే ఓ అవగాహన వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్వ్యూలో మీరు మంచి ప్రతిభ కనపరిస్తే కోరుకున్న ఉద్యోగం అపాయింట్ ఆర్డర్ రూపంలో మీ ఇంటి తలుపు తడుతుంది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకునే రెస్యూమ్‌ను తయారు చేయడం పూర్తి అయినట్లయితే ఒకసారి ఈ కింది చిట్కాలను పాటించి చూడండి.
మొదటగా మీకు సంబంధించిన పూర్తి సమాచారం రెస్యూమ్‌లో పొందుపరిచారో లేదో చూడండి. పొందుపరిచిన సమాచారంతో మీ భవిష్యత్ ఉద్యోగ ప్రదాత మీలోని ప్రత్యేకతలను తెలుసుకునే అవకాశముందో లేదో తనిఖీ చేయండి. రెస్యూమ్ మీది కాదని ఇతరులది అన్నట్లుగా భావించి జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు చదవండి. రెస్యూమ్‌లోని తప్పొప్పులు గుర్తించి సవరణలు చేయండి.
అనంతరం మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు మీ రెస్యూమ్‌ను చూపించి, అందులోని సమాచారంతో వారు ఏకీభవిస్తారో లేదో కనుక్కోండి. వారి అభిప్రాయాలకు అనుగుణంగా మీ రెస్యూమ్‌కు నగిషీలు దిద్దండి. మీలోని ప్రత్యేకతలు, మీ కార్యదక్షత ఇలా మిమ్మల్ని ముందు వరుసలో నిలిపే అంశాలు మీ రెస్యూమ్‌లో చేరి ఉద్యోగానికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: