తెలంగాణ భవన్‌లో జరుగుతున్న చర్చ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణా ముందస్తు అసెంబ్లీలో సత్తా చాటిన తెలంగాణా రాష్ట్ర సమితి ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం అవుతుంది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం అవుతున్న తెరాస అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహిరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మాదిరే.. ముందగానే ఎంపీ అభ్యర్ధులను ప్రకటించేందుకు తెరాస సిద్దం అవుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు చాలా తక్కువగా మార్పులు చేసిన తెరాస ఇప్పుడు మాత్రం ఎక్కువగా మార్పులు చేయాలని భావిస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టిఆర్‌యస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది.తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను టిఆర్‌యస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ సారి సిట్టింగ్ ఎంపీలను మార్చాలని గులాబీ పార్టీ బావిస్తుంది. దీంతో టిఆర్‌యస్ పార్టీ నుండి మళ్ళీ తమకు ఎంపీ టికెట్ వస్తోందా రాదా అనే అయోమయంలో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి 17 స్థానాల్లో 16 స్థానాలను గెలుచుకోవలని గులాబీ పార్టీ చూస్తోంది. 16 స్థానాల్లో పోటీ చేసి 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలంటే సరైన అభ్యర్థులకు టికెట్ లు ఇవ్వాలని టిఆర్‌యస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.

తెలంగాణ లోని 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపిలను కొందరిని మార్చాల్సిందే అని పార్టీ ఆలోచిస్తోంది. ఎంపీలుగా ఉండి నియోజకవర్గంల్లో యాక్టివ్‌గా లేని నాయకులను ఈ సారి పక్కన పెట్టాలని గులాబీ పార్టీ అధినేత అనుకుంటున్నారట. ముఖ్యంగా ఖమ్మం యంపీ గా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ యంపీ జితేందర్ రెడ్డి, ఆదిలాబాద్ యంపీ నగేష్ కి ఈ సారి టికెట్ ఇవ్వడం కష్టమనే చర్చ తెలంగాణ భవన్ లో నడుస్తోంది.

ఎంపిలుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నగేష్ లు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులకు సహకరించలేదట. దీనితో చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆయన సన్నిహితులు కూడా యంపీల పని తీరుపై పిర్యాదు చేశారని చర్చ నడుస్తోంది. మరి ఈ ముగ్గురు యంపీలు భవితవ్యం ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: