ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేలకు సీట్ల భయం?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రకాశంజిల్లాలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మేల్యేకు సీట్ల భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగాలేని సిట్టింగ్‌లకు టికెట్స్ ఉండవని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు తాను ఎంపీగా పోటీచేయాలంటే నేను చెప్పిన నేతలను మార్చాలంటూ చంద్రబాబు వద్ద టిడిపి ఎంపీ అభ్యర్ది మాగుంట కండిషన్ పెట్టారట. దీంతో చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న మార్పులేంటి?

ప్రకాశంజిల్లాలో పలువురు టిడిపి నేతలు తీవ్రఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఓ ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మేల్యేలు ఈ సారి టిక్కెట్టు రాదేమో అని బెంగపెట్టుకున్నారు. గత నెలలో ఒంగోలులో పార్టీ రివ్యూ చేసిన చంద్రబాబు పనీతీరు సరిగా లేని నేతలకు ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీనికి తోడు తాను ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే తాను చెప్పిన ఇద్దరు ముగ్గురు నేతలను మార్చాల్సిందేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత కొద్ది రోజులుగా పట్టుపడుతూ వస్తున్నాడు. దీనిలో భాగంగానే చంద్రబాబు ఆ నేతలను మార్చే పనిలో పడ్డారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి బావమరిది, ఎమ్మేల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహుతుడైన కనిగిరి ఎమ్మేల్యే కదిరి బాబురావుకి ఈసారి మొండిచెయ్యి తప్పేలా లేదు. మాగుంట ఇచ్చిన తొలగింపు బాబితాలో కదిరి బాబురావు పేరు కూడా ఉండడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈసారి చంద్రబాబు మార్చబోయో నేతల్లో కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం, సంతనూతలపాడు తదితర సెగ్మెంటు నేతలు ముందు వరసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో కనగిరి ,యర్రగొండపాలెం సిట్టింగ్‌లు కాగా మార్కాపురం, సంతనూతలపాడు నేతలు గత ఎన్నికల్లో పోటిచేసి ఓడిన వారు. కనిగిరి ఎమ్మేల్యే కదిరిబాబు రావు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ఆయనపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికి మాగుంటకు అక్కడి రెడ్డి సామాజిక వర్గం మద్దతు కొంతైనా కూడగట్టుకోవాలంటే కనిగిరిలో రెడ్డి సామజిక వర్గం అబ్యర్ది అయితేనే బావుంటదనే ఆలోచనతో మాగుంట ఉన్నారు.

అందులో బాగంగానే కదిరిబాబురావును మార్చాల్సిందే అని మాగుంట పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇక యర్రగొండపాలెం ఎమ్మెల్యే డెవిడ్ రాజు పనితీరు బాగోలేకపోవడంతో పాటు.. ఆయన అక్కడ ప్రజల మద్దతు కూడగట్టట్లేదని టిడిపి సర్వేలు చెప్తున్నాయి. దీంతో ఆయనను కూడా మార్చే దిశగా అదిష్టానం కసరత్తు చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇంచార్జిలుగా చెలామణి అవుతున్న మార్కాపురం మాజీ ఎమ్మేల్యే కందుల నారాయణరెడ్డి , సంతనూతలపాడు మాజీ ఎమ్మేల్యే విజయకుమార్ లు ఇద్దరిని మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలెట్టారు. కందుల నారాయణ రెడ్డిపై పలుఆరోపణలు ఉండడంతోపాటు ,ఆయనకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అకాశాలు లేవని పార్టీ బావిస్తోంది.దీంతో నారాయణరెడ్డిని ఈ సారి తప్పించేందుకు చంద్రబాబు సిద్దం అయ్యారు. అయితే నారాయణరెడ్డి మాత్రం తాను మార్కాపురం నుండే పోటి చేస్తానని చెప్తున్నారు.

ఇక సంతనూతలపాడు మాజీ ఎమ్మేల్యే విజయ్ కుమార్‌ని తప్పించాలని ఆ నియోజకవర్గంలోని నేతలు ఎప్పటి నుండో పట్టుబడుతున్నారు..పలుమార్లు చంద్రబాబుకు కూడా పిర్యాదు చేశారు. ఎస్పి రిజర్వుడు నియోజకవర్గమైన సంతనూతలపాడులో మెజార్టీ సామాజికవర్గం నేతలకు విజయకుమార్‌కి పడట్లేదు. దీంతో ఇక్కడ ఆయన గెలుపు అవకాశాలు ఉండవనే కోణంలో విజయ కుమార్‌ని మార్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: