నందమూరి సుహాసినికి టీఆర్‌ఎస్ ఆఫర్!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీ దక్కించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం చేయలేదు. అయితే అందుకు పలురకాల సమీకరణాలే కారణం అని తెలుస్తుండగా.. తాజాగా టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్.. మహాకూటమి తరుపున పోటీ చేసి ఓడిపోయిన తెలుగుదేశం నేత నందమూరి సుహాసినికి మంచి ఆఫర్ ఇచ్చారట. అసలు విషయం ఏంటి?

తెలుగుదేం పార్టీని ఏపీలో ఇబ్బందుల్లో పెడతాం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. అన్న టీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశంపై పక్కా రాజకీయ అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్దమైంది. ఆంధ్రలో జగన్‌కో పవన్‌కో సపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న కేసీఆర్.. చంద్రబాబే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి మ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై… ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసి ఓడిపోయిన నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని.. ఓడిన తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండి, సేవ చేస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆది నుంచి సుహాసిని పోటీని కేసిఆర్.. కేటిఆర్‌లు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే.. ఎన్నికల వేళ మాత్రం సుహాసినిపై విమర్శలు మాత్రం చేయలేదు. ఓడిపోయే స్థానం నుంచి పోటీ చేయిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. మాములుగా కేసిఆర్‌కు నందమూరి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సుహాసినిని టీఆర్‌ఎపస్ పార్టీలోకి ఆహ్వానించాలని కేసిఆర్ భావిస్తున్నారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ సముచితమైన స్థానం కల్పించాలని ఆయన యోచిస్తున్నారట. ఈమేరకు ఆమెతో ముఖ్యమైన నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే నందమూరి కుటుంబం మాత్రం తమకు పదవులు అక్కర్లేదు అని అన్నారట. ఇలా ఆమె గాని పార్టీలోకి వస్తే, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నందమూరి కుటుంబాన్ని ఓ ఆయుదంగా వాడేందుకు కేసిఆర్ ప్రణాళిక వేశారు. కాని దీనికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: