పేదరికం, నీతి నిజాయతీ ఇప్పుడు గుర్తొచ్చాయ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తన పార్టీ ప్రజాశాంతి తరఫున మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని వ్యక్తం చేశారు. ఈసారి అదికారంలోకి వచ్చేది తామేనాని ప్రజల ఆశీర్వదం తనపై ఉందని వ్యాఖ్యానించారు..ఈ మేరకు హిందూపురం లో తన అభ్యర్థిగా టి‌వి యాంకర్ స్వాతి రెడ్డి ని బాలకృష్ణ పై పోటీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయం ఇలా ఉండగా అటు సినిమా వాళ్లు ఇటు రాజకీయ నాయకులు మాత్రం పాల్ పై విమర్శలు చేస్తునే ఉన్నారు. అంతకుముందు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్ కి ఒక్క ఓటు కూడా పడదు అని తన టెయిత్తర్ ద్వారా వ్యక్తం చేయగా, తాజాగా నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘పాల్ కి ఒక్క ఓటు కూడా రాదని, ఐదేళ్లుగా పత్తాలేని పాల్ కు పేదరికం, నీతి నిజాయతీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో దిగే ముందు ఈ నాలుగున్నరేళ్లూ పాల్ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటు డిమాండ్ చేశారు. పాల్ అసలు ప్రజలకు ఏం చేశారో చెప్పమని ,తన వద్ద లక్షల కోట్ల ఉన్నట్లైతే పేదలకి పంచొచ్చుగా’ అంటూ పాల్ పై విమర్శలు కురిపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: