భారత్ లో ఏన్నికలు సమీపిస్తున్న సంధర్బంగా మత హింస జరిగే అవకాశాలు ఉన్నాయని, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత్ పై మరిన్ని దాడులకు పొంచివున్నారని అమెరికా నిఘా విభాగం ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డైరెక్టర్ డాన్ కోట్స్ హెచ్చరించారు..
తాము సురక్షితంగా ఉండాలని భావిస్తున్న ఉగ్రవాదులు, తమ దేశం మద్దతుతో పొరుగు దేశాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న పోరాటానికి కూడా పాకిస్థాన్ సరైన సహకారాన్ని అందించడం లేదని ఆయన ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హిందూ జాతీయవాద సిద్ధాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తే ఈ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మత ఉద్రిక్తతలు పెరిగాయని ఇవి ఇలాగే ఉంటే ఇస్లామిస్ట్ ఉగ్రవాద ముఠాల ప్రాబల్యం పెరిగి మరింత పుంజుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు
Advertisements