31,000 కోట్ల స్కామ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొబ్రాపోస్ట్ వెబ్సైట్ ఎడిటర్ అనిరుద్ధ బహల్ మంగళవారం నాడు న్యూ డిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ‘దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) అనే సంస్థ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ బ్యాంక్‌ల ద్వారా రూ.97,000 కోట్ల రుణాలు సమీకరించిందని, డొల్ల కంపెనీల నెట్‌వర్క్‌ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు రూ.31,000 కోట్లు దారి మళ్లించారని వివరించింది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమని పేర్కొంది.
తమ ఆర్దిక బల్లాన్ని పెంచుకునే దిశలో ప్రజలని మబ్యపరిచే విధంగా రుణాలు ఇప్పించిందని, డొల్ల కంపెనీలపై ప్రజల ద్వారా పెట్టుబడులు పెట్టించారని, పన్నులు ఎగ్గొట్టారాని తద్వార మొత్తం 31,000 ప్రజా ధనాన్ని దోచుకున్నారని దేశం లోనే ఇది అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు
ఈ ఆరోపణలు నిజాలు కాదని అవాస్థవాలని తిప్పికొట్టారు డి‌హెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థ స్టేక్ హోల్డర్ కపిల్ వధవణ్ నియమాల ప్రకారమే రుణాలు ఇచ్చామని రుజువులు లేని ఆరోపణలు చేయొద్ధని, రుజువులుంటే కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని కొబ్రపోస్ట్ సంస్థ ని హెచ్చరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: