2జి నుంచి 3జీ గా.. మారిన కాంగ్రెస్

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక వాడ్ర అలియాస్ ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పార్టీ వర్గాల్లో మరింత చురుకు దానాన్ని మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే ప్రతి పక్షాలు మాత్రం ఆమె రాక పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అందంగా ఉంటే ఓట్లు పడవని ఒకరు , తన రాజకీయ ఆరంగేట్రం వల్ల తన భర్త రాబర్ట్ వాడ్ర అక్రమాలు మరింత ఎక్కువగా చేస్తాడని మరొకరు.

తాజాగా భారతీయ జనత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఇదే దారిని అనుసరిస్తూ ఆమె పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని కొంటాయ్‌లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో వంశపారంపర్య నాయకత్వాంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 2జీ నుంచి 3జీ అయిందన్నారు. ఆ సమయంలో రూ.12లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగితే ఇప్పుడు ప్రియాంక గాంధీ రాకతో అవి 15 లక్షల కోట్లకి చేరి 3జీ స్కాములుగా మారుతాయన్నారు. ఇద్దరు జీల నుంచి ఇప్పుడు ముగ్గురి జీలతో మరిన్ని కుంభకోణాలకి ప్రణాళికలు సిద్ధం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో గాంధీ ఫ్యామిలీ దేశాన్ని నాశనం చేస్తోందన్న ఇకపై జనం కాంగ్రెస్ ని నమ్మరని సభలో వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: