వైరల్ గా మారిన రామ్ ట్వీట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ కార్ల సంస్థ ఏర్పాటైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ పెనుగొండ లో తమ ప్లాంట్ ని ఆరంభించింది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ సమీపంలో 650 ఎకరాల స్థలంలో ప్లాంట్ ని ఆరంభించింది.ఈ సంధార్బంగా చంద్రబాబు కియా మొదటి కార్ ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ సంధార్బంగా చంద్రబాబు తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ‘కొన్నేళ్ల కిందట ఏపీలో అనంతపురం లాంటి మారుమూల జిల్లాకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం నిరంతర కృషితోతో జిల్లాకు సాగునీటిని అందించామన్నారు. ఇంకా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని.. రాయలసీమ ఏపీకి పారిశ్రామిక హబ్‌గా మారబోతుంది’అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ హీరో రామ్ ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన కొన్ని క్షన్నాలోనే ఆ ట్వీటు సామాజిక మాద్యమాల్లో చాలా విరల్ అయ్యింది. ఏపీ అభివృద్ధికి మద్దతు తెలుపుతున్న ఏకైక టాలీవుడ్ హీరో రామ్ అంటూ పలువురు అభినందించారు.
నెటిజన్ల ట్వీట్లకి స్పందిస్తూ ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే… ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు. ముందు నేను పౌరుడిని.. ఆ తర్వాతే నటుడిని’ ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: