అగ్నికి ఆహుతైన నుమాయూష్…

Google+ Pinterest LinkedIn Tumblr +

మంగళవారం రాత్రి సుమారుగా 9 గంటల సమయానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎటు చూసిన మంటలే కంగారులో జనం పరుగులు తీసిన దృశ్యం చోటు చేసుకుంది. ఒక పక్క నిప్పు మరో పక్క ఉక్కిరిబిక్కిరిగా భావోద్వేగాలతో జనాలా పరుగులు.

మంటలు వేగంగా వ్యాపించిన తరునాన దాదాపుగా 400 కి పైగా స్టాళ్లు అగ్ని దాహానికి బలయ్యాయి. భయభ్రాంతులకి గురైన సందర్శకులు పరుగులు తీయగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకుండా స్వల్ప గాయాలతో కొందరు బయటపడ్డారు. ప్రమాద వార్త అందిన వెంటనే అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఫైరింజన్ల రాకతో పరిస్థితులు కాస్త చేతికొచ్చినా అయిదారు స్టాళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం మేరకు అటుపక్కనే ఉన్న ఆంధ్ర బ్యాంక్ స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం చేత నిప్పులు రాచుకున్నట్టు తెలుస్తుంది. క్షణాల్లో నిప్పు పక్క స్టళ్లకి పాకి 400 స్టళ్ల ఆహుతికి దారి తీసింది. నుమయూష్ లో మొత్తం 2500 స్టళ్లు ఉనత్త్లు తెలుస్తుంది. స్టళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తపరిచారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ ‘మంటలు రాజుకోవడానికి ముందు పేలుడు శబ్దం వినిపించిదని , గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్లు కొంత మంది చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని’ఆయన్ వెల్లడించారు

Share.

Comments are closed.

%d bloggers like this: