సామాజిక కార్యకర్త , ఉద్యమకారుడు అన్నా హజారే ప్రభుత్వం పట్ల నిరాహార దీక్షలకి మారు పేరు. ఆయన 2011 డిసెంబర్ లో అవినీతి కి రహితం గా న్యుడిల్లీ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి ఆయన స్వగ్రామం రాలే గావ్ సిద్ది కి సమీపంలోని యాదవ్బాబా ఆలయానికి వెళ్లి హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు.
లోక్పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మలాడుతూ ‘లోక్పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్లో ఆమోదం పొందింది. కానీ ఇంతవరకూ లోక్పాల్, లోకాయుక్తలను నియమించలేదు. అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేదని’ ఆయన స్ఫష్టం చేశారు. మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తున్నట్టు తెలిపారు, అయినప్పటికి లోక్పాల్, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ నిరాహార దీక్ష విరమించేది లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని అప్పటికి వరకు దీక్ష చేపడతానని ఆయాన జవాబిచ్చారు.