ఎన్నికలు సమీపిస్తుండగా సమావేశాలతో సభలతో ప్రజలని ఆకట్టుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి చంద్రబాబు. ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో మరోపక్క దేశ రాజకీయాల్లో తనదైయన శైలి లో ధూసుకుపోతున్నారు.
ఇటీవలే మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు అఖిలపక్ష సభ నిర్వహించగా మంగళవారం నాడు అమరావతి లో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా అన్నీ పార్టీల వారిని పాల్గొనవాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సమావేశం మూడోసారి జరగడం గమనార్హం..
ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలు వైసిపి, జనసేన పార్టీలు మాత్రం భేటీకి దూరంగా ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే ఈ సమావేశానికి వచ్చేదే లేదని జనసేన పార్టీ తేల్చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెట్టి ఒక బహిరంగలేఖను విడుదల చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ వర్గాలు కూడా టీడీపీ పై విరుచుకుపడ్డాయి. అసలు ఏపీకి ప్రత్యేకహోదా దక్కకపోవడానికి ముఖ్య కారణం టీడీపీనే అని నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేసి, ప్రత్యేకహోదా అన్నవారిని జైల్లో పెడతామని బెదిరించి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండంతో నంగనాచి వేషాలు వేస్తూ, డ్రామాలు ఆడుతున్నారని, విరుచుకపడ్డాయి. ఈ క్రమం లో టిడిపి నేతలు వైసిపి నేతలపై వ్యంగ్యాస్త్రాలు విసురుతు ‘అసెంబ్లీకి రారు.. అఖిలపక్ష భేటీకి రారు.. కేంద్రంపై పోరాటానికి కూడా కలిసి రారా..? అంటూ విరుచుకపడ్డారు.