Advertisements

సర్వెల్లో జాగన్ దే హవా…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు రాచుకున్న నిప్పులా బగ్గుమంటుంది. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సభలతో, సమావేశాలతో ప్రజలని ఆకట్టుకుంటుంటే మరో వైపున ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర అంటూ ఊర్లు వాడలు తిరిగి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాడు. ప్రజల్లో ఎవరు గెలవబోతున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ స్థానాలతోపాటు ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లోస్తాయి? అనే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి.. తాజాగా జాతీయ మీడియా సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్స్ వెళ్లడయ్యాయి.
సర్వేల నిమిత్తం వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో జగన్ 23 గెలుస్తారని టి‌డి‌పి కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుంధాని ఈ సుర్వెల్లో వెల్లడైంది. అయితే బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలకి ఒక్క స్థానం కూడా రాదు సర్వేలు తేల్చేసాయి.
ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకోవాలని చూస్తుండగా.. ఆ పార్టీకి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌లో అభిప్రాయపడింది. కాంగ్రెస్ 5, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానం చొప్పున గెలవొచ్చని అంచనా వేసింది. ఈ సర్వేల పట్ల వైసీపీ పార్టీ వర్గాలు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: