ఎన్నికలు సమీపిస్తున్న సంధర్బం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వోటర్లను ఆకట్టుకునే దిశలో విశ్వప్రయ్త్నాలు చేస్తున్నారు. మహిళలకి యువతకి మరియు అన్నీ విభాగాల వోటర్లకి వారాల వర్షాలు కురిపిస్తున్నారు. పసుపు కుంకుమ పథకం కింద మహిళలకి 10 రూపాయలు ఇస్తామని సంచలన ప్రకటన చేశాడు. డ్వాక్రా మహిళల వర్గాల పై రుణాలు ఎత్తివేస్తామని వారికి కోటి నలభై లక్షల స్మార్ట్ ఫోన్లు ఇస్తామని ఇప్పటికే వారి వోట్లు స్వాదినం చేసుకున్నాడు.
ఫించనార్లకి తీయటి శుబవర్త వినిపించారు వారికి ఇస్తున్న 1000 రూపాయల ఫించన్నీ రెండింతలు చేస్తామని 2000 రూపాయల పింఛన్లు మంజూరు చేశారు కాగా జనవరిలో వారికి 3000 ఆపై 2000 చేస్తామని కరారు చేశారు.యువతని ఆకట్టుకునే దిశలో, ఇప్పటికే నిరుద్యోగ భృతి పథకం కింద వారికి 1000 రూపాయలు ఇస్తున్న తరుణంలో ఇప్పుడు దాన్ని యువనేస్తం పథకం అనే పేరుతో 2000 గా ఇవ్వాలని నిర్ణయించారు .అయితే ఈ విషయాన్ని కేంద్రం బడ్జెట్ ప్రకటించిన తరువాత అసెంబ్లీ లో అధికారికంగా ప్రకటించాలని భావిస్తునట్టుగా సమాచారం. ఇదే కోణంలో భక్తులని ఆకర్శించేందుకు అమరావతి లో కళియుగ దైవం స్వామివారి మందిరం నిర్మిస్తున్నారు. ఇలా పలు రీతులా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ లెక్కన ఇప్పటికే కోటి ఇరవై లక్షలకు పైగా జనాన్ని బాబు ఆకర్షించినట్లే..!