అసలు నీకు సిగ్గుందా..? బుద్ది ఉందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్య ఏ టి‌వి చానల్ చూసిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఏ కనిపిస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తన విమర్శలతో వ్యంగ్యపు మాటలతో అన్నీ పార్టీల వారి పై దుమ్మెత్తి పోస్తున్నాడు. రాబోయే ఎన్నికలలో తానే గెలవబోతున్నారని తన పై ప్రజల ఆశీర్వాదం ఉందని దేవుడు కూడా తన వైపే ఉన్నాడని అంటున్నారు. ఒక రకంగా జనాలు పాల్ చేసే విమర్శలకి హాస్యానికి గురవుతుంటే రాజకీయ నయకులు మాత్రం తన పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పాల్ కి, సినీ నటుడు 30 ఇయర్స్ గా గుర్తింపు పొందిన పృథ్వీ రాజ్ కి మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

సినీ నటుడు విసిపీ కార్యకర్త పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘మతప్రభోదకుడు అని బిరుదు పెట్టుకుని 271 దేశాలకు ఆశీర్వాదం ఇచ్చాను. మోదీకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను.. చంద్రబాబుకి ఆశీర్వాదం ఇచ్చానని చెప్పుకునే మీరు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. నువ్వేం మత ప్రభోదకుడువో.. ప్రజాశాంతి అనే బొందలో పార్టీకి అధ్యక్షుడివో తెలియడం లేదు. ఈ ఐదేళ్లలో ఎక్కడు పోయావు పాల్.. ఎన్నికలు వస్తున్నాయి కదా అని ఏదో గంగిరెద్దులు ఊపుకునే వాడిలా వచ్చేసి.. వాళ్లు గెలుస్తారు.. వీళ్లు గెలుస్తారు.. జగన్ అవినీతి పరుడు అనడానికి నీ దగ్గర ఏం ఉందిరా.. ఆధారం. నువ్ మాకు గౌరవం ఇవ్వలేదు కాబట్టే నీకు ఇవ్వడం లేదు కాబట్టే నీకు ఇవ్వడం లేదు.

మత ప్రభోదకుడివి మత ప్రభోదకుడిలా ఉండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మనిషిని గౌరవించడం చేతకాని నువ్వేం మత ప్రభోదకుడివి. మాట్లాడితే.. జగన్ అలా.. పవన్ ఇలా.. చంద్రబాబు ఇలా అంటూ కూతలు కూస్తున్నావ్.. నువ్వేమన్నా నీతిమంతుడివి అని బిల్ల కొట్టుకొని వచ్చావా? ఎప్పుడూ ఇలాంటి మాట్లాడకు. అసలు నీకు సిగ్గుందా.. బుద్ది ఉందా.. మాట్లాడితే జగన్, చంద్రబాబులను నీతో ప్రెస్ మీట్‌కి రమ్మని పిలుస్తున్నావ్.. నువ్వంటే ఖాళీగా ఉన్నావ్. నీకు పనీ పాటా లేదురా.. నీ నోటిని ఫినాయిల్ వేసి కడగాలా’ అంటూ ఓ రేంజ్‌లో కేఏ పాల్‌పై ఫైర్ అయ్యారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ.

Share.

Comments are closed.

%d bloggers like this: