బడ్జెట్ లో భాగంగా తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు పథకం తరహాలో కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అదే తరహాలో సన్నకారు రైతులని దృష్టిలో పెట్టుకొని వారికి చేయూతని ఇచ్చే దిశగా సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఐదు ఎకరాల లోపు భూములు ఉన్న సన్నకారు రైతులకి ఏడాదికి 6 వేల రూపాయలు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి వేయాలని నిర్ణయించింది. దీనికి గాను ప్రతి ఏడాధి 12 కోట్ల మండి రైతులు లబ్ధి పొందుతారని వారి ప్రయోజనాలకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు కేంద్ర తాత్కాలిక ఆర్ధిక శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఈ పథకం కోసం ఏటా 6 వేల కోట్ల బడ్జెట్ వెచ్చించామని ఆయన వెల్లడించారు.
దీనికి స్పందిస్తూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రైతన్నకి చేయూతని ప్రక్టించినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు ట్వీట్లో భాగంగా కేటిఆర్ ‘ అనుకరణ అనేది ప్రశంసకు ఉత్తమ మార్గం. సీఎం కేసిఆర్ మాది నుంచి పుట్టిన ‘రైతు బంధు’ ద్వారా యావత్ దేశ రైతాంగం పొందటం సంతోషంగా ఉంది. ఎన్డిఏ ప్రభుత్వం పథకం పేరు మార్వచు కానీ స్పూర్తి మాత్రం రైతు బంధు పథకమే’ అని ట్వీట్ చేశారు