బాబు అండగా.. ఆటో డ్రైవర్లు నిశ్చింతగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రచారం లో భాగంగా వరూస సభలతో, స్పీచులతో జనాల్ని ఆకట్టుకుంటున్నారు. తాజాగా గన్నవరం లో ఆయన ఆటొ డ్రైవరు రూపం ఏత్తారు..! సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు సీఎం వద్దకు రావడంతో ఆయన కూడా ఆటో డ్రైవర్‌‌గా మారిపోయారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ. ‘మీరు ఎలాగైతే ముందుండి ప్రేక్షకుల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తారో అదే మాదిరిగా తాను కూడా అదరికి అండగా ఉంటూ డ్రైవర్ లా ముందుండి రాష్ట్రాన్ని ముందుకు చేరుస్తానని’ అన్నారు. ఆటొ డ్రైవేర్స్ అందరికీ తాను అన్నగా ఉంటానని వారి కష్టాలు తనకి తెలుసని ఈ సంధర్బంగా మూడు చక్రాల మోటార్ వెహికిల్ ట్యాక్స్ ని రద్ధు చేస్తునట్టుగా ప్రకటించారు. ఇది కేవలం మోదటిదే అని మున్ముందు ఇంకా చాలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారిని ఇంకా కూడా ఎమ్పౌఏర్ చేయాలనే భావనా తనకి ఉందని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న 3,75,000మంది ఆటో డ్రైవర్లకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని.. ఇందుకోసం ఆటో డ్రైవర్స్ అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని చంద్రబాబు సూచించారు. ఈ 3,75,000 మంది ఆటో డ్రైవర్లు ఆటో వెనకాల ‘థాంక్యూ సీఎం’ అని రాయించుకోవాలని.. టీడీపీ జెండా పెట్టాలని అన్నారు.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుందని అప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా వాటినే వాడుతారని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చునని.. విద్యుత్ బిల్లు విషయంలో ఆటో డ్రైవర్లకు కొంత మినహాయింపునిచ్చే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పారు. టీడీపీ అంటేనే పేదల ప్రభుత్వం అని.. పేదవాళ్ల కళ్లలో ఆనందం చూడాలన్నదే తన కోరిక అని అన్నారు. ఈ ట్యాక్స్ రద్ధు వల్ల 140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినప్పటికి ఆటో డ్రైవర్ల కష్టమే తనకి ముఖ్యమని ఈ నిర్ణయం తిస్కున్నానని ఆయన వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: