సామాజిక కార్యకర్త , ఉద్యమకారుడు అన్నా హజారే ప్రభుత్వం పట్ల నిరాహార దీక్షలకి మారు పేరు. ఆయన 2011 డిసెంబర్ లో అవినీతి కి రహితం గా న్యుడిల్లీ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి ఆయన స్వగ్రామం రాలే గావ్ సిద్ది కి సమీపంలోని యాదవ్బాబా ఆలయానికి వెళ్లి హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు.
లోక్పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. లోక్పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్లో ఆమోదం పొందినా కానీ ఇంతవరకూ లోక్పాల్, లోకాయుక్తలను నియమించలేదని , లోక్పాల్ లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ దీక్ష విరమించేది లేదని, ఆయన దీక్ష అరభించారు. నిన్న అన్నా మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ‘అప్పటినించి దీక్ష చేస్తునప్పటికి ఎవ్వరూ దీని పై స్పందించట్లేదని తనకి ఏదైనా జరిగితే దానికి పూర్తి కారణం మోడి ఏ అవుతాడని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే తన పద్మ భూషణ్ పురస్కారాన్ని రాష్టాపతి కొవింద్ సమక్షం లో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని తాను అవినీతికి విరుద్ధంగా పోరాడినందుకు తనకి ఇచ్చిన పదవికి ఇప్పుడు విలువ పోతుందని, తనకి శ్రేయస్సు కావాలని పదవులు అక్కర్లేదనీ ఆయన అన్నారు.