కే‌సి‌ఆర్.. ఇది ఫెడరల్ ఫ్రాంటా..? బి‌జే‌పి ఫ్రంటా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ లో అంతటి కాంగ్రెస్, టి‌డి‌పి ఇతర వామపక్ష పార్టీలు కలిసి మహాకూటమిని తయారు చేసినా తెరాస పై చిత్తు చిత్తుగా ఓడటం చూసేమో కాంగ్రెస్ హై కమాండ్ పార్టీ లోని పలు పోస్టులని మార్చింది. ఈ మేరకు ప్రచార కమిటి భాద్యతలని మాజీ సినీ నటి విజయ శాంతి కి అప్పగించింది. తెలంగాణ లో లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపధ్యం లో పార్టీ వర్గాలలో ప్రచారాల జోరు మొధలైంది. ప్రచారాలలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ కి చెందిన గద్వాల్ నియజకవర్గం పార్టీ ఇంచార్జ్ డి‌కే అరుణ, విజయశాంతి లు జూబ్లీహిల్ల్స్ లోని డి‌కే అరుణ ఇంటిని వేదికగా చేసుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ‘కే‌సి‌ఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ బి‌జే‌పి, కాంగ్రెస్ బారి నుండి ప్రజల్ని విముక్తి చేస్తానని ఫెడరల్ ఫ్రంట్ పెడతానని అన్నావు గా ఏమైంది ని ఫెడరల్ ఫ్రంట్..? పశ్చిమ బంగాల లో నీవు ఎందుకు లేవు..? ఈరోజు నీవు బి‌జే‌పి తో కలిసి కుట్రలు చేస్తున్నావనే విషయం ప్రజలకి అర్ధమయ్యింది. తెరాస బి‌జే‌పి మధ్య ఒప్పందం ఉన్నట్లుగా ఉంది. ని ఫెడరల్ ఫ్రంట్ బి‌జే‌పి కి ఒక డూప్ ఫ్రంట్ అంటూ విరుచుకపడింది. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఇప్పుడు పూజలు చేసుకుంటున్నావ్ ప్రజలకి కావాల్సింది పూజలు కాదు పనులు అని ఆమె ఘాటుగా విమర్శించింది. ఈ సంధర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి ఆమె సమాదానం ఇచ్చింది

Share.

Comments are closed.

%d bloggers like this: