తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు సిఎం కేసిఆర్ ని ఒక పక్క పొగుడుతూనే మరో పక్క మాజీ మంత్రి హరీష్ రావు పై సంచలనమైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
కేసిఆర్ తో తనకి ఎటువంటి విభేదం లేదని ఇంకా కేసిఆర్ వల్లే తనకి రెండు మూడు సార్లు మేలు జరిగిందని ఆయన అన్నారు. హరీష్ రావు ఒక బ్లాక్ మెయిలర్ అని తనని జైలులో పెట్టించడం లో హరీష్ దే ముఖ్యపాత్ర అని ఆయన పేర్కొన్నారు, తాను హరీష్ ని నమ్మనని కేవలం ఉనికి కోసమే హరీష్ రావు తనను జైల్లో పెట్టించారని ఆరోపించారు.. తనని జైలులో పెట్టించడం వల్లనే తనకి తన రాజకీయ వారసులని పరిచయం చేసే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేవీపీ రామచంద్రరావుతో మంతనాలు జరిపినట్లు పేర్కొన్నారు. తనకు కేసీఆర్ తో వ్యక్తిగత వైరం లేదని, త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ ను కలుస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడనని ఆయన స్పష్టం చేశారు.
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై ప్రశంసలు చేశారు. కేటిఆర్ చాలా మంచివాడని తెలివి గల వాడని పొగడ్తలతో ముంచెత్తరు. మరో వైపు కొంగ్రెస్ పార్టీ లో లాబీయింగ్ చేసేవాళ్లకే పదవులు ఉన్నాయంటు తనకి లాబీయింగ్ చేయటం రానందుకే తనకి ఈ పదవి లేదని, అయిన పదవులు ఆయనకి ముఖ్యం కాదని ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.