ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్న సంధర్భంగా అసెంబ్లి సమావేశాల లో భాగంగా మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. శాసన సభలో 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ‘’ చారిత్రాత్మకమైన రాజధాని నగరం ‘మన అమరావతి’. ఈ అమరావతిలో వరుసగా 3వబడ్జెట్ ప్రవేశ పెట్డడం నాకు గర్వకారణం. నాలుగున్నరేళ్ల ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం, సవాళ్లను అధిగమించిన తీరు గుర్తు చేసుకుందాం. హేతుబద్దత లేకుండా రాష్ట్రవిభజన జరిగింది దీనివల్ల రాజధాని నగరాన్ని కోల్పోయాం ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు. ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు, దీనితో రాష్ట్రవ్యాప్తంగా నిరాశా నిస్పృహలు అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారు ఆ నమ్మకంతోనే శ్రీ చంద్రబాబుకు అధికారం అప్పగించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందని మనము అనుకున్నామా..? రాష్ట్ర ఆర్ధిక మనుగడపై అప్పట్లో భయాందోళనలు.. ఉద్యోగుల జీతాలను చెల్లించలేమనే అనుమానాలు.. ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఊహించామా..? ముఖ్యమంత్రి అనుభవం తో వరుసగా రెండంకెల వృద్ధి సాధించాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందంజ అంచనా వేశామా..?పెట్టుబడుల ఆకర్షణలో ముందంజ అంచనావేశామా..? అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మిస్తామని కలగన్నామా..?
28,074మంది రైతులు భూములు ఇస్తారని ఊహించామా..? భూముల సమీకరణ విజయవంతం అవుతుందని ఊహించారా..?రాజధానికి 2,28,559మంది విరాళాలు ఇస్తారని ఊహించామా..? పోలవరం డ్యామ్ శరవేగంగా జరుగుతుందని అనుకున్నామా..? అతిపెద్ద ప్రాజెక్టులలో పోలవరం ఒకటి అవుతుందని ఊహించామా..? నదుల అనుసందానంలో ఏపి మార్గదర్శకం అవుతుందని అనుకున్నారా..? 3ప్రాంతాలలో 3అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి కలగన్నారా..? ఇంత త్వరగా మన గడ్డపైనే మన పాలన అనుకున్నామా..? తీవ్ర ఆర్ధికలోటులో ఇంత పెద్దఎత్తున సంక్షేమం ఊహించారా..?రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని అనుకున్నారా..? పించన్లు 10రెట్లు చేస్తామని ఊహించామా..? మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తామని అనుకున్నారా..? గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కలగన్నారా..? దేశానికే మార్గదర్శక నమూనా ఇస్తామని ఊహించారా..? అని వాస్తవాలను నిమరవేస్తూ సభ ని ఒక ఊపుకి తీసుకొచ్చారు.
అవన్నీ ఈ రోజున సాధించాము. అందరి కలలు నిజం చేశాము. ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ విజయాలు సాధించడం గర్వకారణం. ఈ మంత్రిమండలిలో సభ్యుడు కావడం నాకు గర్వకారణం. ప్రజలిచ్చిన బాధ్యత చంద్రబాబు భుజాన వేసుకున్నారు. వినమ్రతతతో,అంకితభావంతో పనిచేశారు.
తల్లి గర్భంలో నుంచి జీవితాంతం వరకు సంక్షేమం పథకాలు. ప్రతి జీవన దశలో పేదలకు సంక్షేమం అందిస్తాం. సమాజ వికాసం,కుటుంబ వికాసం,సుస్థిర వృద్ధి మా ముఖ్య లక్ష్యాలు. మా ప్రభుత్వ విధానాలు, చర్యలతో అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి సత్ఫలితాలు. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం మహిళా సాధికారత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలనా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
20ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు చేశాం. ఈరోజు 94లక్షల మంది మహిళలు అందులో ఉన్నారు అందులో 17లక్షల మంది ఎస్సీలు, 5లక్షలు ఎస్టీలు, 46లక్షలు బీసిలు,5లక్షలు మైనారిటీలు, 21లక్షలు జనరల్ కేటగిరి మహిళలు అందులో ఉన్నారు. 2014కు ముందు మహిళా సంఘాలపై తీవ్ర ఆర్ధిక ఒత్తిడి.
‘పసుపు-కుంకుమ’ పథకం తో తొలిదశలో రూ.8,604కోట్లు ఇచ్చాం ప్రతి మహిళకు రూ.10,000 ఇచ్చాం. ‘అన్న’గా ఆడపడుచుల బాధ్యత చంద్రబాబు భుజాన పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఒక్కో మహిళకు మరో రూ.10వేలు ఇస్తున్నాము.
ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్ లో రూ.4,000 ఇస్తాం. 93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది. 20,50,794మంది మహిళలకు రూ.63,283కోట్ల బ్యాంకు లింకేజి ఇప్పించాం. స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం. స్త్రీనిధి రుణాల మొత్తాన్ని 5రెట్లు పెంచాం. మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు ఇచ్చాం. ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180రోజుల ప్రసూతి సెలవులు, 1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చాం. తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ తో 7.19లక్షల మహిళలకు లబ్ది. 6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్ అందించాం ఇలా ఎన్నో చేశాం. అని బారి ప్రసంగం చేశారు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు.