పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనెర్జీ శారదా కసులో భాగంగా సిబిఐ జోక్యం పై నిరసిస్తూ కోల్కతా ప్రాంగణంగా దార్నాకి దిగారు. ఈ దార్నా నేటితో మూడో రోజుకి చేరుకుంది. శారదా చిట్ఫండ్ కేసులో సీబీఐకు, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు. ఈ కేసులో తామే నైతిక విజయం సాధించినట్టుగా ఆమె ప్రకటించారు.
కేసు దర్యాప్తులో భాగంగా కోల్కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల ఫైరయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన దీదీని విమర్శించారు.
సీబీఐ విషయంలో మమత ఓవరాక్షన్ అనేక అనుమానాలను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ చర్య వెనుక మమత వ్యూహమేంటో..? ధర్నాకు విపక్షనేతలను పిలవడం వెనుక అర్థమెంటోనని జైట్లీ ప్రశ్నించారు. కేవలం పోలీస్ అధికారికి అండగా ఉండేందుకే మమత ధర్నా చేపట్టారనుకుంటే అది పోరపాటేనని.. దీని వెనుక ఆమె ఉద్దేశం తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునేందుకే అని అరుణ్ జైట్లీ ఆరోపించారు. మమతకు చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు మద్ధతు పలికారు అందులో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని మండిపడ్డారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశాన్ని పాలించాలని ఎత్తుగడలు వేస్తున్నారని జైట్లీ అభిప్రాయపడ్డారు. సిద్ధాంతాలు లేని సంకీర్ణాల వల్ల దేశ భవిష్యత్ కు విపత్తు లాంటిదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.