ప్రేమే ప్రాణం తీసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు టీవీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నారు. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా ఝాన్సీ గుర్తింపు పొందారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఝాన్సీ ఆత్మహత్య గురించి తన తల్లిదండ్రులు పొలుసులకి ఫిర్యాదు చేయగా. పోలిసులు ఘటనా స్థాలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం. ఆమె తన సోదరుడు, తల్లితో కలిసి ఉంటోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేరు. వెంటనే మృతుదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
విషయంలోకి వస్తే ప్రేమలో విఫలమైనందుకే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. సూర్య అనే వ్యక్తితో ఆమె గతకొంతకాలంగా సహజీవనం చేస్తోంది. పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో ఝాన్సీని సూర్య దూరం పెట్టాడు. మరోవైపు అతని కోసం సీరియల్స్‌ కు సైతం ఆమె దూరమయ్యారు. నటనను వదులుకోవడం సూర్య మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణంపై పలువురు టీవీ నటీనటులు సంతాపం తెలిపారు

Share.

Comments are closed.

%d bloggers like this: