దీక్ష చేసినా.. సీబీఐ ముందు హాజరుకావాల్సిందే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత మూడు రోజులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శారద కేసులో సి‌బి‌ఐ జక్యం పై సి‌బి‌ఐ దురుసు వ్యవహారంపై నిరసనగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్నటి తో ఆమె దీక్ష 3వ రోజుకి చేరుకుంది. కేంద్రం తన పై వ్యక్తిగతంగా పగ సాధించలేక ఇలాంటి చర్యలకి పాల్పడుతుందని అందుకే దీక్ష ని చేస్తునట్టుగా ఆమె తెలిపారు. సి‌బి‌ఐ జోక్యం పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో ధాఖాలు వేసింది.

సీబీఐ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదంపై మంగళవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐకి కొంత ఊరట కలిగించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించిందని సమాచారం వచ్చింది. అయితే, తటస్థ ప్రాంతంగా మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్‌లో సీబీఐ ఎదుట ఆయన హాజరుకావాలని సుప్రీం సూచించింది.
ఈ వ్యవహారంలో రాజీవ్ కుమార్, పశ్చిమ బెంగాల్ డీజీపీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

నిన్న అసెంబ్లి లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్కతా లో మమతా నిర్వహిస్తున్న దీక్ష ప్రాంతానికి వెళ్ళి మమత ను కలిశారు. తన మద్దతు తెలుపుతూ మమత తో కొంతసేపు సంభాషించారు. ఆ కొంత సేపటికి మమత దీక్ష ని విరమించినట్టు ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: