అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. అమెరికా కి ఉత్తర కొరియా కి గత కొంతకాలం గా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాను ఉత్తర కొరియా అద్యక్షుడితో మరో సారి భేటీ అవ్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన అటు అమెరికన్లలోనే కాకుండా అంతర్జాతీయంగా జనాలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మునుపు మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. హటాత్తు గా ఈ ప్రకటన చేయడం అందరినీ అలరించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అమెరికా కి రాజకీయ ఐక్యత అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొంత కాలంగా అణు పరీక్షలు ఆగిపోయాయని, గత 15 నెలల్లో కొత్తగా క్షిపణి ప్రయోగాలూ ఏవి జరగలేదని అన్నారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ఎన్నిక అవ్వకపోయుంటే ఇప్పటికల్లా ఉత్తరకొరియాతో యుద్ధం జరిగేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తనకి ఇతర దేశాలతో మంచి సంభందాలే ఉన్నాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ తో కూడా మంచి మిత్రుత్వం ఉందని చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాంలో సమావేశమవుతున్నానని ట్రంప్ ప్రకటించారు.
గత ఏడాధి, అంతకు ముందు కొంత కాలంగా అమెరికా మరియు ఉత్తర కొరియాల మద్య కోల్డ్ వార్ జరుగుతున్నా నేపధ్యం లో అలాంటి పరిణామాలకి సమాప్తి పాలికేట్టుగా ట్రంప్ కిం జంగ్ ఉన్ తో బేటీ కావాలని పిలుపునిచ్చారు. కాగా గత ఏడాది జూన్ మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య సింగపూర్‌లో తొలిసారి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా ‘వివిధ అంశాలపై సయోధ్యకు సంకేతాలిస్తూ ట్రంప్ స్నేహహస్తం చాచారు. మౌలిక వసతుల అభివృద్ధి, వైద్యుల చీటీపై విక్రయించే మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్యసేవలకు సంబంధించిన అంశాలపై పరస్పర అంగీకారానికి అవకాశమిచ్చేలా మాట్లాడారు. ఈసారి కూడా వీరి మధ్య ఇదే రీతిలో సమావేశం జరగబోతుందని అమెరికన్లు భావిస్తున్నారు. సమావేశ వేధికగా వియత్నాం ని ఎంచుకన్నపాటికి వియత్నాం లో ఎక్కడ అన్న విషయం పై ఇంకా క్లారీటి లేదు.