అత్యాచారం..ఒక యువతి పై మరో యువతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అత్యాచారాలు రూపుమారుతున్నాయి. రోజురోజుకి అత్యాచారాల శైలి మారుతుంది, మానభంగాలకి అదుపు లేకుండా పోతుంది. చట్టం లో ఎన్ని మార్పులు తెచ్చిన వీటికి హద్దు అదుపే లేకుండా పోయింది…తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి.. మరో యువతిని సెక్స్ టాయ్స్ సాయంతో దారుణంగా అత్యాచారం చేసిన సంఘటనకు దారితీసింది. ఘటన గురించి సంబంధించిన వివరాలను విన్న పోలీసులు కూడా విస్తుపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ 25ఏళ్ల యువతి.. బతుకుదెరువు కోసం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. కాగా.. ఆమెకు అక్కడ 19ఏళ్ల యువతి పరిచయమైంది. ఈ క్రమంలో 25ఏళ్ల యువతిపై మరో యువతి మనసుపారేసుకుంది.

పాతికేళ్ల యువతితో స్వలింగ సంపర్క ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టింది. అంతేకాకుండా బలవంతంగా బెల్ట్ సాయంతో నడుంకి కృతిమ పురుషాంగం (సెక్స్ టాయ్) తగిలించుకొని బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది.

ఇద్దరు యువకులు బాధితురాలిని బెడ్ మీద పడుకోబెట్టి పట్టుకొనగా.. సదరు యువతి సెక్స్ టాయ్ తో రేప్ చేసేది. ఇలా పలుమార్లు చిత్రహింసలకు గురి చేసింది. ఈ బాధలను భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెక్షన్ 377 ప్రకారం కేసు నమోదు చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాక.. ఈ తరహాలో నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.

సదరు యువతిపాటు.. ఆమె ఇద్దరు మగ స్నేహితులు కూడా యువతిపై అత్యచారానికి పాల్పడ్డారు. దానంతటినీ వీడియోలు తీసి.. ఆమెను ఎవరికీ చెప్పవద్దంటూ బ్లాక్ మొయిల్ చేసేవారు. కాగా.. చివరకు యువతి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన వారిని పోలికులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: