ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉంది..! యాత్ర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ పేరు ఆయన పంచకట్టు రాష్టంలోనే కాకుండా దేశం లో ఎక్కడ అడిగిన ఎవరిని అడిగినా గుర్తుపట్టే స్తాయి. ఈ పేరు పేద ప్రజల గుండెల్లో ఓ చెరగని ముద్ర. ఆయన పాలనలో ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు అందులో రాజీవ్ గృహకల్ప, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేద ప్రజల జీవితాలకు వెలుగు రేఖలుగా నిలిచాయి. ఆ మహానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘యాత్ర’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి వైఎస్సార్‌ పాత్రలో నటించారు. దీనికి మహి వి రాఘవ ధర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీస్ కి ముందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ప్రోమోలు ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ తీసుకొనివచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న లభిస్తోంది. ఓవ‌ర్‌సీస్‌లోనే 180 స్క్రీన్స్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుద‌ల చేశారు

ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విదేశాల్లో ఈ సినిమా కావడం తో విదేశీయులు సైతం ఈ సినిమాకి గురించి అద్భుతమైయన స్పందన తెల్యజేస్తున్నారు. వై‌ఎస్ పాత్ర మమ్ముటి కి అతికినట్టుగా ఉందని సినిమా చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైఎస్సార్‌సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్‌ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’ బెనిఫిట్ షోను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు.

Share.

Comments are closed.

%d bloggers like this: