14.40 లక్షల ఎకరాలకు సాగునీరు- సి‌ఎం కే‌సి‌ఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ మంచి జోరుమీద ఉన్నారు, ఈ వానకాలం సీజన్‌లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించాలని ఆయన అన్నారు, ఇందుకు అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోభాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారాజ్ నుంచి ఈ వానకాలంలోనే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని, ఆ నీటిని మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లకు తరలిస్తామని చెప్పారు.

గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. వాటిని ఎత్తిపోయడానికి భారీవ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. చెరువులను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలని, ఇందుకోసం ఎస్సారెస్పీ కాల్వలన్నింటినీ మరమ్మతు చేయాలన్నారు. ఎక్కడ ఏ పనిచేయాలో 50 మంది ఇంజినీర్లను నియమించుకుని యుద్ధప్రాతిపదికన సర్వేచేసి, అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.

అవసరమైన అన్నినిధులనూ వెంటనే మంజూరుచేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వానకాలానికి ఎస్సారెస్పీ పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకూ సాగునీరందాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: