భారత్ ఘనవిజయం.. 1-1 తో సిరీస్ సమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ నూజిలాండ్ పర్యటన లో భాగంగా ఈరోజు రెండవ పొట్టి ఫార్మాట్ టి-20 ఆట జరిగింది. ఎడన్ పార్క్ ఆక్క్లాండ్ వేధికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుతమయిన ఘన విజయం సాధించింది. మునుపు టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 159 రన్ల స్కోర్ ని భారత్ కి టార్గెట్ గా ఇచ్చింది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ చక్కటి ప్రధర్శనతో మ్యాచ్ ని చేజిక్కిచ్కుంది.

పోయిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిన భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఆయా తప్పుల్ని సరిదిద్దుకొని ఒక చక్కటి ప్రదర్శనతో మ్యాచ్ ని గెలుపు దిశకి చేరువేసింది. ఫినిషర్ ధోనీ తోడుగా, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమదైన స్టైల్లో మ్యాచ్ను ముగించారు. కివీస్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించింది టీమిండియా. రెండో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 1-1 తో సమం చేసింది.

ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన భారత్ ఇంకా ఒక మ్యాచ్ కనుక గెలిస్తే టి-20 సిరీస్ కూడా కైవసం చేసుకోగలదు. మొదటి మ్యాచ్ లో భారత బౌలర్లు భారిగా విఫలమయ్యారు కాగా ఈ మ్యాచ్ లో వాళ్ళు ఆ స్తితిని అధిగమించినట్టు తెలుస్తుంది. కృనాల్ పాండ్య 3 వికెట్లు తీసి మ్యాన్ ఒఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. గత కొన్ని మ్యాచ్లలో బ్యాట్టింగ్ లో విఫలమవుతూ వచ్చిన రోహిత్ శర్మా ఈ మ్యాచ్ లో చెలరేగాడు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రధార్శించాడు. మొదటి తొమ్మిది ఒవెర్ల లోనే ఓపెనెర్లు ఇద్దరు కలిపి 79 రాన్లు జత చేసి మ్యాచ్ పై కొంత భారాన్ని తగ్గించారు. తర్వాత చెలరేగిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 40 రన్లు చేసి మ్యాచ్ ని ముగించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: