ధర్మపోరాటం.. నమ్మకద్రోహులకు గుణపాఠం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రేపు ఒక దుర్దినం, ఒక చీకటి దినం. పుండు మీద కారం జల్లడానికే మోది వస్తున్నారు. మోది గుంటూరు పర్యటన సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరసన దినం పాటించాలి. చేసిన దుర్మార్గం చూసేందుకు వస్తున్నాడు. ఇక్కడున్న దుర్మార్గుడు సహకరిస్తున్నాడు. మోది ద్రోహంపై జగన్ ఒక్కమాట కూడా అనడు! బిజెపి,వైసిపి కుమ్మక్కు అయ్యారు అనడానికి ఇదే రుజువు.

ఇద్దరు కలిసి ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నారు, నాయకత్వాన్ని నాశనం చేస్తున్నారు. రాఫెల్ బురదలో మోది కూరుకుపోయారు, రాఫెల్ లో పిఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ట. దొంగే దొంగ దొంగ అని అరుస్తూనట్టుంది. ప్రతిపక్షాలపై అవినీతి బురద జల్లుతున్నారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారు. ఇతరులపై అవినీతి నిందలు,అన్యాయం చేసిన వ్యక్తే రాష్ట్రంపై అడుగు పెడుతున్నాడు. అలాంటి మోది అడుగులు ఆంధ్రప్రదేశ్ నే అపవిత్రం చేస్తాయి.

పసుపు చొక్కాలు,నల్ల చొక్కాలతో నిరసన తెలపాలి. పసుపు బెలూన్లు, నలుపు బెలూన్లతో నిరసనలు. బిజెపి ద్రోహానికి నిరసనగా ర్యాలీలు నిర్వహించాలి. ముగ్గురు మోదిలకు వ్యతిరేకంగా శాంతియుతంగా మన నిరసనలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి రెండేళ్లుగా అసెంబ్లీకి రాడు. వైసిపి 4సెషన్లకు డుమ్మా కొట్టింది. ఇలాంటివాళ్లు ప్రజాసేవకే అనర్హులు! రాజకీయాలకే అనర్హులు వైసిపి నాయకులు!

రెండేళ్లుగా 4సెషన్లకు వైసిపి అసెంబ్లీకి రాలేదు.మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానం లేదు. చేతల్లో చూపే నాయకులకే చరిత్రలో స్థానం. ఢిల్లీలో ధర్మపోరాటానికి నేను సిద్ధం అయ్యాను. అందుకే మనల్ని తిట్టడానికి ఏపికి మోది వస్తున్నారు. బిజెపి, వైసిపిలకు తగిన గుణపాఠం చెప్పాలి.

ఢిల్లీలో టిడిపి ధర్మపోరాటం దేశానికే దిక్సూచి. టిడిపి ధర్మపోరాటం నమ్మకద్రోహులకు గుణపాఠం. మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఈ పోరాటం.టిడిపి పోరాటానికి అందరి సంఘీభావం. ఢిల్లీ టిడిపి దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో దీక్షలు.ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకోవాలి.ప్రతి ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పోరాటం.రాష్ట్ర ప్రయోజనాలే మన లక్ష్యం.హక్కుల సాధనే మన సంకల్పం.

Share.

Comments are closed.

%d bloggers like this: