7 నెలల పాపను చంపిన కిరాతక తండ్రి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఊహ తెలియని ఒక 7 నెలల బిడ్డని భార్యపై అనుమానంతో ఓ కసాయి తండ్రి బావిలో పడేశాడు…వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం చౌడిరెడ్డిపల్లెకు చెందిన కృష్ణ అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన నాగవేణిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

దీంతో ఈ దంపతులకు ఏడు నెలల వయసున్న కుమార్తె భవ్య పుట్టింది. అయితే..ఈ మధ్య భార్యపై అనుమానంతో కృష్ణ తరచూ వేధింపులకు గురిచేయసాగాడు. ఇంతలో నాగవేణి ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. కాగా.. శుక్రవారం కృష్ణ ..భార్యను తీసుకుపోవడానికి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. ఎంత వారిస్తున్నా ఆమె మాటలు పట్టించుకోకుండా చిన్నారిని తీసుకెళ్లాడు.

ఎంతసేపటికి భర్త, బిడ్డ తిరిగి రాకపోవడంతో ఆమె రోధిస్తూ అక్కడే కూర్చొంది. అది అలా వుంటే.. సాయంత్రం పెద్ద పంజానీ మండలం నిడిగుంట సమీపంలోని ఓ బావిలో బాలిక శవాన్ని అక్కడి స్థానికలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ చిన్నారి మృతదేహాం తన బిడ్డ భవ్యేనని చెప్పడంతో నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: