బాలయ్య హైపర్ వార్నింగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ అనే టి‌వి షో ద్వారా పరిచయమైన వ్యక్తి హైపర్ ఆది. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది..బాలయ్యకు అంత అవసరం ఏమొచ్చిందనే విషయం ఎవరికీ అర్దం కాలేదు. తాజాగా ఈ విషయమై హైపర్ ఆది ని అడగగా..

హైపర్ ఆది మాట్లాడుతూ… త‌న‌కు బాల‌కృష్ణ గారి నుంచి ఎలాంటి వార్నింగ్ రాలేదని వార్నింగ్ రావ‌డం అనేది అబ‌ద్ధ‌మ‌ని తేల్చేసాడు. ఎవ‌రో యూట్యూబ్ ఛానెల్ వాళ్లు వ్యూస్ కోసం కావాలని కాంట్రవర్సిని క్రియేట్ చేసారని కొట్టి పారేసాడు. తనను ఇరికించాలని, తనపై బురదజల్లాలని చేసిన ప్రయత్నమే అన్నాడు.

అయితే అప్‌మట్లో తను బాల‌య్య‌పై ఓ స్కిట్ చేసానని.. ఆ టైమ్ లో.. ఎవ‌రో ఓ అభిమాని ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చిన మాట వాస్త‌వ‌మే అన్నారు. అలాగే మరో విషయం అని చెప్తూ..ఆ వార్నింగ్ కూడా త‌న‌కు కాద‌ని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ విషయం బయిటకు వచ్చిందో..లేక బాలయ్యపై స్కిట్ వేసాం కాబట్టి…ఊహించి అలా రాసేసారో కానీ అటువంటివి ఏమీ జరగలేదన్నారు. ఇదంతా అవాస్తవమని ఆయన తీసిపారేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: