మొరాకో యువతి.. ముక్కలుముక్కలుగా ప్రియుడ్ని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళ పదేళ్ల క్రితం దుబాయ్‌కి వచ్చింది. తమ దేశస్థుడైన ఓ 29 ఏళ్ల యువకుడిపై మోజు పడింది. కొన్నాళ్ల తర్వాత అతడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ సహజీవనం చేయడం మొదలెట్టారు.

ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు.. ఈ విషయం ఆ అబ్బాయికి తెలియదు. అయితే ఏమైందో ఏమో అతన్ని చంపేసింది. ముక్కలుగా ముక్కలుగా నరికేసింది. దొరికిపోతానేమోననే భయంతో అతని మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకుని అక్కడ చెక్ చేసిన పోలీసులు…ఆ ఇంట్లో కనిపించిన దృశ్యాలు చూసి కంగు తిన్నారు.

అయితే అప్పటికే సదరు మహిళకు పెళ్లయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని ఆ యువకుడికీ తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆమె… తన ప్రియుడిని చంపేసింది. అతని శవాన్ని ఏం చేయాలో తెలియక మూడు ముక్కలుగా కోసి… కుక్కర్‌లో పెట్టి ఉడికించింది.

దీంతో పక్కింట్లో ఉన్న మహిళకు దుర్వాసన వచ్చింది. వెంటనే వాచ్‌మెన్‌కు ఫిర్యాదు చేసింది. అతను ఏం జరిగిందని అడగగా ఎండు చేపలను కొన్నానని, అవి చెడిపోయాయని చెప్పింది. పాడైపోయిన చేపలను డస్ట్బిన్‌లో పడేసినందుకు కంపు కొడుతోందని చెప్పింది. అయితే రెండు, మూడు రోజుల తర్వాత కూడా వాసన తగ్గకపోగా, ఇంకా పెరగడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదుచేసుకుని ఆ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ వాసనకు పోలీసులు సైతం ఇబ్బంది పడి, ముక్కులు మూసుకోగా… అదే ఇంట్లో సదరు యువతి మాత్రం స్వేచ్ఛగా తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Share.

Comments are closed.

%d bloggers like this: