వెన్నుపోటు పొడవటం లో బాబే సీనియర్..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజకీయ ప్రముఖులు ప్రచారాలు చేస్తున్నారు. వరుస సభలతో ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నిన్న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక సభకి ఆయన ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక సభలో ప్రధానమంత్రి మోదీ ‘ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలను చెప్పారు. ఈ సంధర్భంగా గుంటూరు జిల్లాలో పుట్టిన గుర్రం జాషువా, తిక్కన్న, వావిలాల గోపాలకృష్ణయ్యలను తన ప్రసంగంలో గుర్తు చేసుకొన్నారు.

ఎంతో మంది ప్రముఖులు ఈ గుంటూరు జిల్లా నుండి వచ్చినవారేనని ఆయన అన్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్‌గా ఆయన వర్ణించారు. గుంటూరుకు సమీపంలో ఉన్న అమరావతికి ఎంతో చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అమరావతిని హెరిటేజ్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు ‘ కొత్త కూటములు కట్టడం లో ప్రజలని మోసం చేయడం లో సొంత మనుషుల్ని వెన్నుపోటు పొడవటం లో ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారన్నారు. ఇవాళ ఎవరిని పొగిడారో రేపు వాల్లనే తిడతారని, ఇవాళ ఎవర్ని తిట్టారో రేపు వారి ఒల్లోనే కూర్చోడం చంద్రబాబు కి అలవాటు అన్నారు.
ఎన్‌టి‌ఆర్ రాజకీయ వారసులుగా వచ్చిన మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారా అని ప్రశ్నించారు.. ఆయన ఆశయాలు నిరవేస్తున్నారా..? అని అడిగారు. కేవలం నన్ను తిట్టడం తప్ప మీరు ఇంకేం అభివృద్ధి చేశారో ప్రజలకి తెలియజేయాలని ఆయన అన్నారు.

కేంద్ర పథకాలని తన పథకాలంటు స్టిక్కర్లు యాడ్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన బాబు పై విరుచుకపడ్డారు. మీరు రాజకీయంలో నాకన్నా సేనియర్ అయినప్పటికి మీ చర్యల వల్ల మీ మోసాల వల్ల మీకు తగిన గౌరవం దక్కలేదని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే అసెంబ్లీలో అభినందిస్తూ తీర్మానం చేసిన విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్ మాసంలో దీన్ని అమలు చేస్తే దీన్ని సరిగా చంద్రబాబునాయుడు ఉపయోగించుకోలేకపోయారన్నారు. రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్టు మోడీ వివరించారు.

విభజన చట్టంలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మోడీ చెప్పారు. ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. ఏపీ ప్రజలు సంస్కారవంతులని దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: