ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయానికి ఏపిం సిఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని మోదీ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్టం పై కక్ష చూపుతున్నారని, చంద్రబాబు ఈరోజు దీక్షా చేపట్టారు. ఏపీ భవన్ ప్రాంగణంలో ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షా ఈరోజు రాత్రి 8 గంటల వరకు సాగబోతుందని సమాచారం. ఈ దీక్షకి మద్దత్తుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు నేతలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న దీక్ష కి మద్దత్తు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగంలో మోదీ ని ఉద్దేశిస్తూ ‘ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రత్యేక హోదా సహ విభజన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపి్ పోరాటానికి ఆయన అండగా ఉంటానని స్పష్టం చేశారు.
రాహుల్ మాట్లాడుతూ ‘ అబద్ధాలు చెప్పడం మోదీ కి అలవాటైందని ఆయనకి అబద్ధాలు చెప్పటం తప్ప ఇంకేం చాతకాదనీ ఆయన అన్నారు. రాష్టానికి ఇవ్వాల్సిన హామీలు తీర్చే బాద్యత మోదీ ది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏపిు ప్రజల పోరాటానికి తామేప్పుడు తోడుంటామని ఆయన అన్నారు. దేశానికి కాపలాదారుగా ఉండాల్సిన వ్యక్తి దొంగలా మారదని ఆయన మోదీ ని విమర్శించారు.