టీఎంసీ నేత దారుణ హత్య..

Google+ Pinterest LinkedIn Tumblr +

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ దారుణ హత్యకి గురయ్యారు. కృష్ణాగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యజిత్ బిశ్వాస్ నదియా జిల్లా పూల్బరిలో శనివారం జరిగిన సరస్వతి పూజకి హాజరయ్యారు. పూజ అనంతరం ఆయన వెళ్తుండగా ఆయన పై దుండగులు కాల్పులు చేసి పరారయ్యారు. కాల్పులు మరింత దేగ్గరగా చెయ్యడం చేత ఆయన అక్కడికక్కడే మూర్ఛపోయాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్లు ఆయన అప్పుడే మరణించాడని ప్రకటించారు.

కొంతకాలంగా పశ్చిమ బెంగాల్ కి కేంద్రానికి సరైన సంభంధం లేకపోవడం తెలిసిందే. ఈ మేరకు మమతా బెనర్జీ కేంద్రం పై నిరసిస్తూ దీక్ష కూడా చేపట్టారు. టీఎం‌సి కి బి‌జే‌పి కి జరుగుతున్నా ఈ యుద్ధం లో బిశ్వాస్ మరణం అనేక అనుమానాలకి దారి తీస్తుంది. ఈ మరణానికి బి‌జే‌పి ఏ వ్యూహం పండిందంటూ టీఎం‌సి నేతలు బి‌జే‌పి పై విమర్శలు చేస్తున్నారు. ముకుల్ రాయ్ అనుచరులే ఈ హత్య చేసి ఉంటారని గౌరవీ శంకర్‌ ఆరోపించారు.

అయితే, టీఎంసీ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఖండించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేసే పార్టీ తమది కాదని ఆయన అన్నారు. హంతకులను వెంటనే పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను బెంగాల్ పోలీసులు చేయకూడదని, కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోవాలని దిలీప్ ఘోష్ కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: