భార్య బిడ్డలని.. పెట్రోల్ పోసి చంపిన కిరాతకుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భార్య కుమారుడిని చంపి పెట్రోల్ పోసి నిప్పంటిచి తగులపెట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేష్(27) అనే వ్యక్తి వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత(26) అనే మహిలతో ప్రేమ లో పడ్డాడు. ఆ ప్రేమ కాస్త పెళ్ళికి దారి తీసింది. 2015లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు.

గత ఎనిమిది నెలల క్రితం వీరిద్దరి మధ్య వివాదం నెలకొని గొడవ జరిగింది. గొడవ పడిన అనంతరం తన తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది సుశ్రుత. అప్పటికే సుశ్రుత గర్బవతి. నాలుగు నెలల క్రితం ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కాగా శనివారం సాయంత్రం భర్తను కలిసేందుకు ఉప్పల్ వచ్చిన భార్యను బైక్ పై ఎక్కించుకుని ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకువచ్చాడు. సుశ్రుత తన వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలని తాను వేసుకోని తన కుమారుడికి పాలలో కలిపి ఇచ్చింది. మెల్లిగా నిధ్రలోకి జారుకున్న వారిని బైక్ పై ఎక్కించుకుని హెచ్ పి సి ఎల్ కంపెనీ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభాకర్ ఎనక్లేవ్ లోకి తీసుకువెళ్లి ఊపిరి అడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తీసుకు వచ్చి చుట్టూ పక్కల ఉన్న కట్టెలను వేసి నిప్పంటించి తగుల పెట్టినట్లు తెలిపారు. అనంతరం పాలకుర్తి వెళ్లి పోలీసులకు లొంగి పోయినట్లు తెలిపారు. నిందితుడి సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: