భారత అమెరికన్లకు శుభవర్త..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికా లో స్థిరపడాలనుకునే వారికి ఒక తీయని శుభవార్త. గ్రీన్ కార్డ్ పరిమితి ని ఎత్తివేసే దిశగా బిల్లుని ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోధామ్ పొందితే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తోన్న భారత్, చైనాలకు చెందిన నిపుణులకు లబ్ధి చేకూరుతుంది. ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 పేరిట ఈ బిల్లును మైక్‌ లీ తో కలిసి భారత అమెరికన్‌ సెనేటర్‌ కమలా హ్యారిస్‌ బుధవారం సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కమలా హ్యారీస్ భారత సంతతి తొలి మహిళా సెనేటర్.

ఈ బిల్లులకు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో సభ్యుల మద్దతు ఉంది. ఉద్యోగ వీసాల కింద ఏడాదికి 1.4 లక్షల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక్కో దేశానికి 9800 వీసాల చొప్పున పరిమితి విధించారు. ఇందువల్ల భారత ఉద్యోగులు చాలా కాలంగా గ్రీన్ కార్డ్ కోసమై వేచి చూస్తున్నారు.

ఈ బిల్లును అమెరికా టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్ ఆహ్వానిస్తున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్ వీసాలతో భారీ సంఖ్యలో అమెరికా వెళ్తున్న భారతీయ నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: