మొసలి కన్నీరు.. ఊసరవెల్లి చేష్టలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుందంటు నిరసనగా ఏపి్ సి‌ఎం చంద్రబాబు ఒక పట్టానా దీక్ష చేస్తుంటే మరో పక్క చంద్రబాబు ది ఒక పోలిటికల్ డ్రామా అంటూ తన మాటలకి, చేష్టలకి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని, ఇదంతా కేవలం బి‌జే‌పి ని టార్గెట్ చేయడం కొరకు తప్ప మరొకటి కాదంటూ చంద్రబాబు పై మండిపడుతున్నారు బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.

చంద్రబాబు కి బి‌జే‌పి ని పతనం చేయాలనే ఉద్దేశం తప్ప మరొక ఊదేశం లేదన్నాడు. ఎన్నికల సంధర్భంగా ఆయన ఇదంతా చేస్తున్నాడని అన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారో తెలుపు ఆంధ్ర రాష్ట్రానికి తామిచ్చిన పథకాలు హామీలని తెలియజేస్తూ ఆయన నిన్న ఏపి ప్రజలకి బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నపుడు సభా ముఖంగా ప్రశంసించిన ఆయన ఇప్పుడు ఎన్నికలు వచ్చే నాటికి ఎందుకు విమర్శిస్తున్నాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినపుడు చంద్రబాబు దానిని స్వాగతించారని, అదే సమయంలో ప్రత్యేక హోదా సంజీవిని కాదని, దానితో రాష్ట్రాలేవీ అభివృద్ధి చెందలేదని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే వారిని అరెస్టు చేయించారని గుర్తుచేశారు.

ఆయన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినపుడు కనీసం మర్యాదపూర్వకంగానైనా ఆహ్వానించని చంద్రబాబు.. హద్దులు దాటి మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌ పక్షాన ఇప్పుడు చంద్రబాబు చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం కట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: